జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు గర్రెపల్లి రాజమౌళి, సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సహకరించిన అసోసియేషన్‌కు కళాశాల సెక్రటరీ షేక్ అబ్దుల్లా, ప్రిన్సిపల్ అన్నబోయిన రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గండ్రపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను హుజూరాబాద్ అడిషనల్ జడ్జి వీణ పరిణతి, జమ్మికుంట ఎస్‌ఐ సంజీవ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రిన్సిపాల్ రేపాల ఇందిర, సర్పంచ్ తోట కవిత లక్ష్మణ్, ఉపసర్పంచ్ బీరేందర్ మాక్, ఉపాధ్యాయులు వారికి ఘన స్వాగతం పలికారు. జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎస్‌ఐ సంజీవ్ 112కు ఫోన్ చేయడం, […]
జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ABVP ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుంచి సువర్ణ ఫంక్షన్ హాల్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సెమినార్‌లో మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి సామాన్య ప్రజల పోరాటం, సర్దార్ పటేల్ నాయకత్వాన్ని వివరించారు. నిజాంను కీర్తించడం అమరుల త్యాగాలను కించపరచడమేనని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జమ్మికుంటలో గాండ్ల తిలకేశ్వర సంఘం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పోతులూరి శ్రీశైలం ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణమని, ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. గాండ్ల కులస్తులకు రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూప దీప నూనె […]
జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బొజ్జపల్లి రాజబాబు హత్యకు గురైన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం కారణంగా రాజబాబుపై దాడి చేసి, అనంతరం మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు వెల్లడైంది. మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టగా, పోలీసులు పార, గడ్డపార, సైకిల్, చున్నీలను స్వాధీనం చేసుకున్నారు.
రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్.. 13 సర్వీసుల్లో మార్పులు హైదరాబాద్: రైలు ప్రయాణం చేయబోతున్నారా? అయితే ఈ సమాచారం తప్పక తెలుసుకోండి. కాజీపేట–బల్హార్షా రైల్వే మార్గంలో జరుగుతున్న సిగ్నలింగ్ పనుల కారణంగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జమ్మికుంట–పోట్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల ప్రభావంతో మొత్తం 13 రైలు సర్వీసులు రద్దు, […]
సెప్టెంబర్ 1, 2026 (జమ్మికుంట లోకల్): తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్టును బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రశ్నించే బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని విమర్శించారు. నల్లగొండ ఘటనలపై న్యాయం కోసం పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకోవడం కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి […]
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం మరియు కేశపురం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ గారి ఆదేశానుసారం సందర్సించడం జరిగిందిగత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన స్థితిగతుల గురించి ప్రజలకు తెలియచెప్పే విధంగా ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అసంపూర్తిగా వదిలేసిన గత ప్రభుత్వం లోని స్థానిక శాసనసభ్యులు రాజకీయం చేయొద్దంటూ వారే స్పృహ లేని రాజకీయాలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందాలని ఒక […]
జమ్మికుంట: పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను దేశిని కోటి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రముఖులు, గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం […]
తెలంగాణ రాష్ట్రంలో Special Intensive Revision (SIR) – 2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని ఓటర్లు తమ పేరు, ఓటరు వివరాలు ముసాయిదా జాబితాలో ఉన్నాయా లేదా అన్నది ఆన్‌లైన్‌లో సులభంగా పరిశీలించుకోవచ్చు. ఓటర్లు తమ పేరు, ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సమాచారం వంటి వివరాలను చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఓటర్లు ఇలా చెక్ చేసుకోవచ్చు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోని […]