Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
Blog
-
జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో ఘనంగా మహా అన్నదానం
జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు గర్రెపల్లి రాజమౌళి, సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సహకరించిన అసోసియేషన్‌కు కళాశాల సెక్రటరీ షేక్ అబ్దుల్లా, ప్రిన్సిపల్ అన్నబోయిన రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-

గురుకుల పాఠశాలను సందర్శించిన అడిషనల్ జడ్జి
గండ్రపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను హుజూరాబాద్ అడిషనల్ జడ్జి వీణ పరిణతి, జమ్మికుంట ఎస్‌ఐ సంజీవ్ సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపాల్ రేపాల ఇందిర, సర్పంచ్ తోట కవిత లక్ష్మణ్, ఉపసర్పంచ్ బీరేందర్, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. జడ్జి చట్టాలపై అవగాహన పెంచుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమస్యలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, 112కు కాల్ చేయాలని ఎస్‌ఐ సంజీవ్ తెలిపారు.
-

జమ్మికుంటలో ABVP ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ABVP ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుంచి సువర్ణ ఫంక్షన్ హాల్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సెమినార్‌లో మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి సామాన్య ప్రజల పోరాటం, సర్దార్ పటేల్ నాయకత్వాన్ని వివరించారు. నిజాంను కీర్తించడం అమరుల త్యాగాలను కించపరచడమేనని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
-

జమ్మికుంటలో గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో మోదీ జన్మదిన వేడుకలు
జమ్మికుంటలో గాండ్ల తిలకేశ్వర సంఘం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పోతులూరి శ్రీశైలం ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణమని, ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. గాండ్ల కులస్తులకు రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూప దీప నూనె టెండర్లు కల్పించడంతో పాటు కుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెన్నంపల్లి విట్టల్దాస్, సంఘం ప్రతినిధులు, కుల బాంధవులు పాల్గొన్నారు.
-

24 గంటల్లో హత్య కేసు ఛేదించిన జమ్మికుంట పోలీసులు
జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బొజ్జపల్లి రాజబాబు హత్యకు గురైన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం కారణంగా రాజబాబుపై దాడి చేసి, అనంతరం మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు వెల్లడైంది. మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టగా, పోలీసులు పార, గడ్డపార, సైకిల్, చున్నీలను స్వాధీనం చేసుకున్నారు.
-

Railway Alert: 13 రైళ్లలో మార్పులు.. ఈ తేదీల్లో ప్రయాణికులకు అలర్ట్
రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్.. 13 సర్వీసుల్లో మార్పులు
హైదరాబాద్: రైలు ప్రయాణం చేయబోతున్నారా? అయితే ఈ సమాచారం తప్పక తెలుసుకోండి. కాజీపేట–బల్హార్షా రైల్వే మార్గంలో జరుగుతున్న సిగ్నలింగ్ పనుల కారణంగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జమ్మికుంట–పోట్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ పనుల ప్రభావంతో మొత్తం 13 రైలు సర్వీసులు రద్దు, పాక్షిక రద్దు, రీషెడ్యూల్ లేదా మార్గమధ్య నియంత్రణకు గురికానున్నాయి.
🚨 ప్రయాణికులకు ముఖ్య గమనిక
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రయాణించే వారు తమ రైలు నంబర్‌ను ముందుగానే చెక్ చేసుకోవాలి. మీ రైలు పూర్తిగా రద్దయిందా? పాక్షికంగా రద్దయిందా? లేక సమయం మారిందా? అనేది నిర్ధారించుకున్న తర్వాతే ప్రయాణ ప్రణాళిక చేసుకోవడం మంచిది.
❌ సెప్టెంబర్ 10న పూర్తిగా రద్దయ్యే రైళ్లు
ఈ రెండు సర్వీసులు సెప్టెంబర్ 10న పూర్తిగా రద్దు కానున్నాయి: రైలు నంబర్ రూట్ తేదీ 17003 కాజీపేట → సిర్పూర్ టౌన్ సెప్టెంబర్ 10 17004 బల్హార్షా → కాజీపేట సెప్టెంబర్ 10
టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
⚠️ 4 రైళ్లు పాక్షికంగా రద్దు
కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు కాకుండా, వాటి మార్గంలోని ఒక భాగంలో మాత్రమే రద్దు కానున్నాయి. రైలు రూట్ రద్దయ్యే సెక్షన్ 17033 భద్రాచలం → బల్హార్షా వరంగల్ → బల్హార్షా 17034 సిర్పూర్ టౌన్ → భద్రాచలం రోడ్ సిర్పూర్ టౌన్ → వరంగల్ 17011 హైదరాబాద్ → సిర్పూర్ కాగజ్‌నగర్ కాజీపేట → సిర్పూర్ కాగజ్‌నగర్ 17012 సిర్పూర్ కాగజ్‌నగర్ → బీదర్ సిర్పూర్ కాగజ్‌నగర్ → కాజీపేట
ఈ మార్పులన్నీ సెప్టెంబర్ 10న అమల్లో ఉంటాయి.
🕐 గంట ఆలస్యంగా నడిచే 3 రైళ్లు
మరో మూడు సర్వీసుల షెడ్యూల్‌ను 60 నిమిషాలు రీషెడ్యూల్ చేశారు.
- 17233 – సికింద్రాబాద్ → సిర్పూర్ కాగజ్‌నగర్
- 67771 – సిర్పూర్ టౌన్ → కరీంనగర్
- 67773 – కరీంనగర్ → బోధన్
అందువల్ల ఈ రైళ్లలో ప్రయాణించేవారు సాధారణ సమయంతో కాకుండా మారిన షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.
🚆 మరో 4 దూరప్రాంత రైళ్లపై ప్రభావం
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నాలుగు లాంగ్-డిస్టెన్స్ రైళ్లను మార్గమధ్యంలో కొంతసేపు నియంత్రించనున్నారు. రైలు నంబర్ రూట్ తేదీ ఆలస్యం 22365 దానాపూర్ → SMVT బెంగళూరు సెప్టెంబర్ 9 75 నిమిషాలు22366 SMVT బెంగళూరు → దానాపూర్ సెప్టెంబర్ 9 45 నిమిషాలు16031 చెన్నై సెంట్రల్ → SMVD కత్రా సెప్టెంబర్ 10 30 నిమిషాలు12622 న్యూఢిల్లీ → చెన్నై సెంట్రల్ సెప్టెంబర్ 9 30 నిమిషాలు
వీటిలో 22365 దానాపూర్–SMVT బెంగళూరు రైలు 75 నిమిషాల నియంత్రణతో అత్యధిక ప్రభావానికి గురికానుంది.
🛠️ అసలు కారణం ఏమిటి?
జమ్మికుంట–పోట్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను కమిషన్ చేసేందుకు నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు.
రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచే ఈ పనుల కారణంగానే తాత్కాలికంగా రైళ్ల రాకపోకల్లో ఈ మార్పులు చేస్తున్నారు.
📌 ప్రయాణానికి ముందు ఇవి చెక్ చేయండి
సెప్టెంబర్ 9 లేదా 10న రైలు ప్రయాణం ఉంటే:
1. రైలు నంబర్ చెక్ చేయండి
2. రైలు రద్దయిందో లేదో చూడండి
3. పాక్షిక రద్దు ఉందా పరిశీలించండి
4. రీషెడ్యూల్ సమయాన్ని గమనించండి
5. మీ రైలు ఆలస్యంగా నడుస్తుందా తెలుసుకోండిముఖ్యంగా కాజీపేట–బల్హార్షా మార్గంలో ప్రయాణించే వారు ఈ మార్పులను తప్పక గమనించాలి.
📲 ఈ సమాచారాన్ని రైలు ప్రయాణం చేసే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
-

కాంగ్రెస్‌ది పిరికిపందల రాజకీయాలు: రాజేష్ ఠాకూర్
సెప్టెంబర్ 1, 2026 (జమ్మికుంట లోకల్): తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్టును బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రశ్నించే బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని విమర్శించారు. నల్లగొండ ఘటనలపై న్యాయం కోసం పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకోవడం కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. అరెస్టులు, అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని రాజేష్ ఠాకూర్ తెలిపారు.
-

జమ్మికుంట మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూంల సందర్శన
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం మరియు కేశపురం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ గారి ఆదేశానుసారం సందర్సించడం జరిగింది
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన స్థితిగతుల గురించి ప్రజలకు తెలియచెప్పే విధంగా ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అసంపూర్తిగా వదిలేసిన గత ప్రభుత్వం లోని స్థానిక శాసనసభ్యులు రాజకీయం చేయొద్దంటూ వారే స్పృహ లేని రాజకీయాలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందాలని ఒక దురుద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వంపై బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారు కౌశిక్ రెడ్డి గారికి నేను ఒకటే సూటి ప్రశ్న మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆరోజు స్పృహ ఉండె కదా అదే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు గుర్తుందా కౌశిక్ రెడ్డి గారు అవే డబుల్ బెడ్ రూమ్ లు పదేళ్ల నుంచి నిరుపేద ప్రజలకు పంపిణీ చేయవలసిన ప్రభుత్వంలోకి నువ్వు వెళ్లి రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్నారు . అప్పుడు గుర్తుకు రాలేదా ఈ డబుల్ బెడ్ రూమ్లు పేద ప్రజల సమస్యలు మేము అధికారంలోకొచ్చి రెండున్నర సంవత్సరాలు దాటింది మా ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు గారు గెలువక పోయినప్పటికీ ఎమ్మెల్యేలతో పోటుపడి ఈ నియోజకవర అభివృద్ధి కొరకై పాటు పడుతున్నరు.
ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావచ్చు ఈ ప్రాంత నిరుపేద కుటుంబాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పక తప్పదు అని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ గారు పత్రికప్రకటలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దుబ్ఫ మల్లన్న చైర్మన్ ముద్దమల్ల రవి టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయిని రవి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెపు సారంగపాని జిల్లా ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య దొడ్డె శ్రీకాంత్ కౌన్సిలర్స్ శ్రీపతి స్వర్ణలత నరేష్ ఒగ్గు రమేష్ మాచర్ల రాజు కుతాడి తిరుపతి ఎగిత అశోక్ యాట్ల అశోక్ పట్టణ కాంగ్రెస్ మహిళా అద్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్.బండి పవన్ పాత ప్రసాద్ యం డి సలీం పోతుల శ్రీనివాస్ సలీమ్ పాషా రమేష్ మారేపల్లి అంజనేయులు అజయ్ అన్వేష్ విన్ను తదితరులు పాల్గొన్నారు -

జమ్మికుంటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
జమ్మికుంట: పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను దేశిని కోటి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రముఖులు, గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, దుబ్బ మల్లన్న, చైర్మన్ రవీందర్, ఆకుల రాజేందర్, కనుమల్ల గణపతి, కార్మిక నాయకులు సామ్రాజ్యం, కోలాగాని రాజు తదితరులు హాజరయ్యారు. గౌరవ కౌన్సిలర్లు శ్రీపతి నరేష్, మాచర్ల రాజు, గుర్రం కావ్య, పరశురాం, కుదాడి తిరుపతి, బత్తుల లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ములుగు ప్రశాంత్ కుమార్, దేశిని కోటి, మరెల్లి మల్ల గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భూస్వాములు, పెత్తందారుల అరాచకాలు, ప్రజలపై విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో తన అనుచరులతో కలిసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు.
గోల్కొండ కోటపై పోరాటం చేసి తన పరాక్రమాన్ని చాటుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొంతకాలం రాజుగా ప్రజా సంక్షేమ పాలన సాగించారని వారు గుర్తుచేశారు. ఆయన ధైర్యం, ప్రజాస్వామ్య భావాలు, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, కులమతాలకు అతీతంగా ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు గడ్డం దీక్షిత్, రాజేశ్వరరావు, గౌడ నాయకులు నాగపురి రాజు, ప్రభాకర్ రాజు, నాయకులు పూదరి రేణుక, శివ, బొంగోని వీరన్న, మరపల్లి బిక్షపతి, శ్రీహరి, పంజాల అజయ్, దేశిని శ్రీనివాస్, పున్నం శీను, పాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.