Swipe News

జమ్మికుంటలో ABVP ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ABVP ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుంచి సువర్ణ ఫంక్షన్ హాల్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సెమినార్‌లో మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి సామాన్య ప్రజల పోరాటం, సర్దార్ పటేల్ నాయకత్వాన్ని వివరించారు. నిజాంను కీర్తించడం అమరుల త్యాగాలను కించపరచడమేనని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.