గండ్రపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను హుజూరాబాద్ అడిషనల్ జడ్జి వీణ పరిణతి, జమ్మికుంట ఎస్‌ఐ సంజీవ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రిన్సిపాల్ రేపాల ఇందిర, సర్పంచ్ తోట కవిత లక్ష్మణ్, ఉపసర్పంచ్ బీరేందర్ మాక్, ఉపాధ్యాయులు వారికి ఘన స్వాగతం పలికారు. జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎస్‌ఐ సంజీవ్ 112కు ఫోన్ చేయడం, […]
జమ్మికుంట (20 జూలై 2026): స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్న 4 అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో తెలుగు-1, కామర్స్-1, డైరీ సైన్స్-1, క్రాప్ ప్రొడక్షన్-1 చొప్పున మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కమీషనర్ ప్రొసీడింగ్స్ నిబంధనల ప్రకారం.. […]
జమ్మికుంట: పట్టణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్ పాషా ఆధ్వర్యంలో పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మొహమ్మద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అఖిలభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో స్వాతంత్ర ఉద్యమాన్ని […]