Swipe News

గురుకుల పాఠశాలను సందర్శించిన అడిషనల్ జడ్జి

గండ్రపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను హుజూరాబాద్ అడిషనల్ జడ్జి వీణ పరిణతి, జమ్మికుంట ఎస్‌ఐ సంజీవ్ సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపాల్ రేపాల ఇందిర, సర్పంచ్ తోట కవిత లక్ష్మణ్, ఉపసర్పంచ్ బీరేందర్, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. జడ్జి చట్టాలపై అవగాహన పెంచుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమస్యలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, 112కు కాల్ చేయాలని ఎస్‌ఐ సంజీవ్ తెలిపారు.